News November 22, 2024
విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ రివ్యూ&రేటింగ్
మెకానిక్‌గా పనిచేసే హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే సినిమా. థ్రిల్లింగ్ ట్విస్టులతో సెకండాఫ్ ఆకట్టుకుంటుంది. కథలో తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి అభిమానుల్లో పెంచారు. విశ్వక్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఫస్టాఫ్‌లో ఊహించే సన్నివేశాలు, స్లోగా సాగడం, కామెడీ పండకపోవడం, క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.5/5
Similar News
News December 2, 2024
HYDలో పార్లమెంట్ వింటర్ సెషన్ నిర్వహించాలి: KA పాల్
AP డిప్యూటీ CM పవన్‌పై KA పాల్ ఆరోపణలు చేశారు. నాగబాబు రాజ్యసభ సీటు కోసం ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారన్నారు. గతంలో కేంద్రమంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని చెప్పారు. ఇప్పుడు పవన్ కూడా BJPతో అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. అటు, దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న HYDలో పార్లమెంట్ వింటర్ సెషన్ నిర్వహించాలన్నారు. దక్షిణాది MPలంతా దీనిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
News December 2, 2024
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి పవన్ వచ్చారు. వీరి భేటీలో రాజ్యసభ సీట్ల సర్దుబాటు, బియ్యం అక్రమ రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
News December 2, 2024
పెళ్లయిన మగవారికి అభిషేక్ బచ్చన్ సలహా
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొన్న అభిషేక్ ‘హస్పెండ్ టిప్స్’ ఇచ్చారు. ‘పెళ్లయిన వాళ్లంతా మీ భార్యలు చెప్పింది చేయండి’ అన్నారు. దీంతో తాను తన భార్య మాట వింటున్నానని, విడాకులు ఎందుకు తీసుకుంటానని అభిషేక్ చెప్పకనే చెప్పారని కొందరంటున్నారు.