News August 24, 2024

ఐసీసీ టోర్నమెంట్లలో విశ్వరూపమే..

image

శిఖర్ ధవన్‌కు ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇతడివే. మొత్తం 20 ఇన్నింగ్స్‌ల్లో 1238 రన్స్ చేశారు. సగటు 65, స్ట్రైక్ రేట్ 98గా ఉంది. అందులో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Similar News

News September 13, 2024

Stock Market: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి రేంజు‌బౌండ్లోనే కదలాడాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సూచీలు గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. BSE సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 82,890 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 25,356 వద్ద స్థిరపడింది. బజాజ్ ట్విన్స్ అదరగొట్టాయి. ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, HDFC లైఫ్ టాప్ లూజర్స్.

News September 13, 2024

రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. 4వేల కిలోమీటర్లకుపైగా రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పగా, ప్రాధాన్యతల వారీగా వాటిని బాగు చేయాలని సీఎం సూచించారు. వరద నష్టం అంచనాలను వేగంగా సిద్ధం చేయాలన్నారు.

News September 13, 2024

ఖరీదైన కారు కొన్న హీరో అజిత్

image

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పోర్షే జీటీ2ఆర్ఎస్ కారును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ.4 కోట్లకు పైమాటే. ఆయన భార్య షాలిని ఆ ఫొటోలను షేర్ చేశారు. అజిత్‌కు రేసింగ్, కార్లు, బైకులు అంటే ఇష్టం. ఈ ఏడాది ఆగస్టులోనూ ఆయన రూ.9 కోట్ల విలువైన ఫెరారీ కొన్నట్లు సమాచారం. దుబాయ్‌లో ఆయన ఆ కారు నడుపుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది.