News July 9, 2024

ఢిల్లీ జట్టు కోసం ప్రాణాలిస్తా: సౌరవ్ గంగూలీ

image

ఢిల్లీ జట్టు కోసం ప్రాణమిస్తానంటూ వ్యాఖ్యానించారు ఆ జట్టు క్రికెట్ డైరెక్ట్, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. నిన్న ఆయన పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ధోనీ, యూవీ, జహీర్, హర్భజన్‌లో టీమ్ ఇండియా భవిష్యత్తును గంగూలీ చూశారంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది. అందుకు సమాధానంగా ‘థాంక్యూ ఢిల్లీ.. ఈ జట్టు కోసం ప్రాణం ఇస్తా’ అని గంగూలీ ట్వీట్ చేశారు.

Similar News

News July 8, 2025

HEADLINES

image

* TG: 60 మంది మహిళల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటాం: CM రేవంత్
* AP: రేపు శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సీఎం చంద్రబాబు
* TG: ఛానళ్లపై దాడి చేస్తే ప్రతిదాడులు: బండి సంజయ్
* TG: నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి: హరీశ్ రావు
* AP: అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం
* జులై 31న ‘కింగ్డమ్’, అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్-1’ విడుదల

News July 8, 2025

‘ఎంప్లాయ్ ఘోస్ట్ క్విట్టింగ్’ కల్చర్‌తో ఫ్యూచర్ ఢమాల్!

image

కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవి కాపాడుకోవడమే ప్రస్తుతం గగనమైపోయింది. ఇలాంటి సమయంలో కొందరు క్షణికావేశంలో యాజమాన్యాలకు చెప్పకుండానే ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లకపోవడం, మెయిల్స్‌కు స్పందించకుండా నెగ్లెక్ట్ చేయడాన్ని ‘ఎంప్లాయ్ ఘోస్ట్ క్విట్టింగ్’ అంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఉద్యోగి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, ఇలా చేస్తే ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు.

News July 8, 2025

ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్

image

ఇంగ్లండ్‌ U19తో జరిగిన చివరి వన్డేలో భారత్ U19 చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది. అంబ్రిష్(66), సూర్యవంశీ(33) ఫర్వాలేదనిపించినా మిగిలిన అందరూ విఫలమయ్యారు. తర్వాత ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. అయితే అంతకుముందు 3 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 3-2తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.