News March 28, 2024
వివేకా మర్డర్ కేసు.. విచారణ ఏప్రిల్ 12కు వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ శంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న జడ్జి.. తదుపరి విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేశారు.
Similar News
News February 7, 2026
KNR: అలంకరణ చేపల పెంపకంలో మహిళల ముందడుగు

జిల్లా మత్స్యశాఖ సహకారంతో కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 19మంది సభ్యులు అలంకరణ చేపల పెంపకం, ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్, కాకినాడలో గల రాష్ట్ర ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో మూడు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతిని క్యాంపు కార్యాలయంలో కలిసి స్వయంగా తయారు చేసిన అక్వేరియం, అలంకరణ చేపను అందించారు. మహిళలు విభిన్న రంగాల్లో విజయం సాధించాలన్నారు.
News February 7, 2026
ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్‌పై J&K సీఎం సెటైర్లు

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.
News February 7, 2026
ఈ చిచ్చరపిడుగును WC జట్టులోకి తీసుకోవాల్సిందేనా?

వైభవ్ సూర్యవంశీ. వయసు 14 ఏళ్లు. ఆడుతోంది వరల్డ్ కప్ ఫైనల్. అయితే ఏంటి? 15 సిక్సర్లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ చేశారు. వైభవ్ ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోర్ ఈజీగా 500 దాటేది. దీంతో ఈ పిల్లాడిని త్వరగా టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీలైతే T20 WC జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. COMMENT?


