News April 23, 2025
VJA: యువతిని బెదిరించి బంగారంతో జంప్

యువతిని నమ్మించి వంచన చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసుల వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన యువతికి (25) ఓ డేటింగ్ యాప్‌లో అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ మంగళవారం కలుసుకున్నారు. యువతిని హోటల్ రూమ్‌కు తీసుకువెళ్లిన సదరు వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఉంగరాలు, సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 23, 2025
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

AP: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓపెన్ SSC పరీక్షలకు 26,679 మంది హాజరవగా 10,119 మంది పాసయ్యారు. ఇంటర్‌లో 63,668 విద్యార్థులకు గాను 33,819 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ కోసం ఈనెల 26 నుంచి మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు ₹200, రీవెరిఫికేషన్‌కు ₹1000 చెల్లించాలి. https://apopenschool.ap.gov.in/ సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
News April 23, 2025
HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.
News April 23, 2025
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత గోల్డ్ రేటు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.3,000 తగ్గి రూ.98,350కి చేరింది. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది.