News November 26, 2024

వాలంటీర్ హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడికి బెయిల్

image

AP: వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌కు అమలాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా దుర్గాప్రసాద్ హత్య కేసు కోనసీమ జిల్లాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడిని శ్రీకాంతే హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. దీంతో గత నెల 23న కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Similar News

News December 2, 2024

ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

image

TG: వాజేడు SI హరీశ్ <<14767070>>సూసైడ్<<>> కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న రాత్రి ఓ యువతితో ఆయన రిసార్ట్‌కి వెళ్లారు. గన్‌తో హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమెనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే ఆ యువతి, హరీశ్ ప్రేమించుకున్నారని, అది నచ్చక ఇంట్లో వాళ్లు వేరే పెళ్లి సంబంధాలు చూస్తుండటంతోనే అతడు అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

News December 2, 2024

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 తగ్గి రూ.70,900కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గడంతో రూ.77,350 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.500 తగ్గి రూ.99,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 2, 2024

‘కన్నప్ప’లో మంచు విష్ణు కూతుళ్లు

image

‘కన్నప్ప’ సినిమా ద్వారా మంచు విష్ణు కూతుళ్లు సినీ అరంగేట్రం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అరియానా- వివియానాలు ఢమరుకంతో నాట్యం చేస్తోన్న ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదలవనుంది.