News January 7, 2025
వాలంటీర్లు వద్దే వద్దు: నిరుద్యోగ జేఏసీ
AP: వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. YCP హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700కోట్లను మాజీ CM జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి డబ్బులిచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు సిద్ధిక్ గుర్తుచేశారు.
Similar News
News January 8, 2025
సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు
AP: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రత పెంచారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాన్ని జత చేశారు. సీఎంకు NSG, SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ బృందం రక్షణ కల్పించనుంది. SPG ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌కు శిక్షణ ఇస్తున్నారు.
News January 8, 2025
రాబోయే 5 రోజులు జాగ్రత్త!
TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా ఉంటోంది. రాబోయే 5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని IMD తెలిపింది. సంగారెడ్డి, కొమురం భీమ్ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు, HYD సహా ఇతర జిల్లాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
News January 8, 2025
విశాల్ ఆరోగ్యంపై నటి కుష్బూ క్లారిటీ
విశాల్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ నటి కుష్బూ క్లారిటీ ఇచ్చారు. ‘11 ఏళ్ల తర్వాత తన ‘మదగజరాజు’ మూవీ రిలీజ్ అవుతుందని డెంగ్యూతో బాధపడుతున్నా విశాల్ ఈవెంట్‌కు వచ్చారు. 103డిగ్రీల టెంపరేచర్ కారణంగా వణికారు. ఈవెంట్ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా కోలుకుంటున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారు’ అని నటి అసహనం వ్యక్తం చేశారు.