News September 16, 2024

YVB వ్యాఖ్యలపై వాలంటీర్ల ఫైర్

image

AP: వాలంటీర్ వ్యవస్థను రద్దు <<14098673>>చేయాలన్న<<>> టీడీపీ నేత, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు YVB రాజేంద్రప్రసాద్‌పై వాలంటీర్ల అసోసియేషన్ మండిపడింది. వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే 2.60 లక్షల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించింది. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొంది.

Similar News

News November 19, 2025

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. తర్వాత బాబా గౌరవార్థం స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేస్తారు. <<18326817>>100<<>> ఆవులను రైతులకు పంపిణీ చేస్తారు. హిల్‌ వ్యూ స్టేడియంలో నిర్వహించే వేడుకలలో పాల్గొని ప్రసంగిస్తారు.

News November 19, 2025

మెదక్: ‘స్థానికం’పై చిగురిస్తున్న ‘ఆశలు’

image

42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

News November 19, 2025

నారాయణపేట: పొగమంచులో ఓవర్‌టేక్ చేయొద్దు: ఎస్పీ

image

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్‌టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.