News April 10, 2024
వాలంటీర్లు రాజీనామా చేయవద్దు: చంద్రబాబు

AP: వాలంటీర్ల వ్యవస్థ లేదని, రాజీనామా చేసినట్లు మంత్రులు మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘వాలంటీర్లు దయచేసి రాజీనామా చేయవద్దు. మేం అధికారంలోకి రాగానే వారి వేతనాలను రూ.10వేలకు పెంచుతాం. వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. బోగస్ వ్యక్తులను నమ్మకండి. దొంగలు సృష్టించే వార్తలను నమ్మవద్దు’ అని విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 20, 2026
జూన్/జులైలో MPTC, ZPTC ఎన్నికలు?

TG: MPTC, ZPTC ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. గతంలో మే నెలలోనే జరపాలని అనుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు జనాభా గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈలోగా ఓటర్ల జాబితా సవరణ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో యంత్రాంగం బిజీగా ఉంది.
News April 20, 2026
ఆల్కహాల్ అలవాటు లేకపోయినా లివర్ సమస్యలు.. ఎలా?

ఆల్కహాల్ అలవాటులేని వారికి లివర్ ప్రాబ్లమ్స్ రావనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య సిటీల్లో చాలామంది ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ (NAFLD) బారిన పడుతున్నారు. గంటల తరబడి కూర్చొని ఉండటం, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతోంది. బరువు తక్కువగా ఉన్నా ఈ సమస్య రావొచ్చు. దీన్ని ‘లీన్ ఫ్యాటీ లివర్’ అంటారు. వాకింగ్, మంచి ఆహారంతో ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
News April 20, 2026
ఇండియా ఆఫర్‌ను తిరస్కరించా: రషీద్ ఖాన్

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్‌షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్‌షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.


