News April 19, 2024
మే 3న ‘ఇంటి నుంచి ఓటు’ ప్రారంభం

TG: ‘ఇంటి నుంచి ఓటు’ హక్కు వినియోగించుకోవాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మే 3 నుంచి 8లోగా వారి ఓటు నమోదు చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 3,31,48,527 ఓటర్లుగా నమోదయ్యారని, ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో 1.17 లక్షల అర్జీలను పరిష్కరించాల్సి ఉందని వెల్లడించారు.
Similar News
News November 19, 2025
డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి 7 రోజుల జైలు: SP

బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసును విచారించిన గజపతినగరం మెజిస్ట్రేట్ విజయ్ రాజ్ కుమార్ ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.
News November 19, 2025
కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

కొత్తగూడెంలో నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం, జిల్లా పర్యటనకు ఖచ్చితంగా కచ్చితంగా వస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 1 నుంచి 8 మధ్య సీఎం పర్యటన ఉండొచ్చని మంత్రి తుమ్మల తెలిపారు.
News November 19, 2025
విశాఖ కమిషనరేట్‌లో వెయిటింగ్ హాల్ ప్రారంభం

విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమిషనరేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.


