News March 29, 2024
బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్.. స్పందించిన ఈసీ!

మరికొన్ని రోజుల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని వార్తాపత్రికల్లో దీనిపై కథనాలు రావడంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడింది. ఈక్రమంలో దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వార్తలు ఫేక్ అని, ఇలాంటి నిరాధారమైన వాటిని నమ్మొద్దని పేర్కొంది. అలాంటి ఆదేశాలివ్వలేదని ఈసీ వెల్లడించింది.
Similar News
News March 19, 2026
రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్

TG: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఏడాది రైతు నామ సంవత్సరంగా ఉండబోతోందని చెప్పారు. ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ ‘అన్నదాతలకు ₹2లక్షల వరకు రుణమాఫీ చేశాం. భూభారతితో భూమి సమస్యలను పరిష్కరిస్తున్నాం. రైతు భరోసాకు ₹18వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఈ నెల 22న మరో విడత డబ్బులు రిలీజ్ చేయనున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.
News March 19, 2026
IPL కోసం ఆల్కహాల్ మానేశా: చాహల్

6 నెలలుగా ఆల్కహాల్ మానేసినట్లు డివిలియర్స్ పాడ్‌కాస్ట్‌లో యుజ్వేంద్ర చాహల్ వెల్లడించారు. 35 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుని IPLలో టీమ్ కోసం 150% శ్రమించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత సీజన్‌లో గాయాలతో ఇబ్బంది పడటం తనను నిరాశపర్చిందన్నారు. అందుకే ఈసారి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహిస్తున్నానని, పంజాబ్ కింగ్స్‌లో సీనియర్ ప్లేయర్‌గా రోల్ మోడల్‌గా ఉండాలనుకుంటున్నట్లు వివరించారు.
News March 19, 2026
కొత్త పార్టీ.. కవితకు ఊరట

TG: పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. ఆమె కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ECకి కోర్టు సూచించింది. ఇక విచారణ సందర్భంగా EC సూచించిన లోపాలు సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సాంకేతిక తప్పులు సరిచేసి మళ్లీ దరఖాస్తు చేశామన్నారు. కాగా కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో ఈసీ కోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే.


