News March 29, 2024

బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్.. స్పందించిన ఈసీ!

image

మరికొన్ని రోజుల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని వార్తాపత్రికల్లో దీనిపై కథనాలు రావడంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడింది. ఈక్రమంలో దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వార్తలు ఫేక్ అని, ఇలాంటి నిరాధారమైన వాటిని నమ్మొద్దని పేర్కొంది. అలాంటి ఆదేశాలివ్వలేదని ఈసీ వెల్లడించింది.

Similar News

News February 9, 2026

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ‘ఈ-ప్యాంట్రీ’ సేవలు ప్రారంభం

image

రైల్వే ప్రయాణికులకు IRCTC శుభవార్త చెప్పింది. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి E-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌ సమయంలో లేదా ఆ తరువాత ఆన్‌లైన్‌లో ఫుడ్, వాటర్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. జర్నీ రోజున సీటు వద్దకే భోజనం అందిస్తారు. ప్రస్తుతం 25 రైళ్లలో ఇది అమల్లోకి వచ్చింది. E-ప్యాంట్రీ సేవను తొలుత వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.

News February 9, 2026

పల్లె కన్నీరు పెడుతోంది: కొలికపూడి

image

AP: తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌తో రాజకీయ చర్చ మొదలైంది. పల్లెల్లో మౌలిక వసతులు, యువతకు ఉపాధిలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన వాట్సాప్ స్టేటస్‌లో ‘3 రోజులు, 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లులేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు. పల్లె కన్నీరు పెడుతోంది’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవల కొలికపూడి-MP కేశినేని చిన్ని మధ్య స్టేటస్ వార్ జరిగిన విషయం తెలిసిందే.

News February 9, 2026

లవ్ ఫెయిల్యూర్స్‌తో పెరిగిన సూసైడ్స్: అనిత

image

AP: ఇటీవలి కాలంలో ప్రేమలు విఫలమవ్వడంతోనే అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలతోనూ ఆత్మహత్యలు పెరిగాయి. వీటిపై ఉన్నత స్థాయిలో అధ్యయనం చేసి మరణాలు అరికట్టాలి. ప్రభుత్వ అవగాహనతో లోన్ యాప్ ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రంలో గంజాయి సాగు జీరో పర్సెంట్ వచ్చింది’అని ఆమె వెల్లడించారు.