News April 20, 2024
తొలిదశలో ఎన్టీయేకు అనుకూలంగా ఓటింగ్: మోదీ
లోక్‌సభ తొలి దశ పోలింగ్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి పోలింగ్‌లో ఎన్డీఏకు అనుకూలంగా ఏకపక్ష ఓటింగ్ జరిగినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. INDIA కూటమికి నాయకుడెవరో ఆ నేతలు తేల్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పారిపోయారని.. ఇప్పుడు వయనాడ్ నుంచి పారిపోతారని చెప్పారు.
Similar News
News November 19, 2024
పౌరసత్వాన్ని వదులుకొని..!
మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఏటా చాలా మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే, వారు వెళ్లిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటంటే.. స్వచ్ఛమైన గాలి & నీరు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, హైక్లాస్ ప్రజా రవాణా అని నిపుణులు చెబుతున్నారు. 2023లో 2.16 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడం గమనార్హం.
News November 19, 2024
దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు: భట్టి
TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.
News November 19, 2024
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: పవన్
AP: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 15వ ఫైనాన్స్ నిధులు కేటాయించామని చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం మా బాధ్యత. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తాం. ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.