News January 24, 2025
విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో VSR పిటిషన్

AP: విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అనుమతి కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది. కాగా రాజకీయాలు వీడుతున్నట్లు VSR ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 17, 2026
పసిబిడ్డ ఆరోగ్యం కోసం..

ప్రెగ్నెన్సీలో తల్లి ఎదుర్కొనే పరిస్థితులు బిడ్డ మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. తల్లి కఠిన పరిస్థితుల్లో జీవిస్తుంటే అవి మెదడుపై ప్రతికూల ఫలితాలు చూపిస్తాయి. డిప్రెషన్, ఓవర్ థింకింగ్, ఒత్తిడి వల్ల శిశువుల మెదడులో నాడుల మధ్య అనుసంధానం బలహీనంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందుకే ఎలాంటి గడ్డు పరిస్థితిలోనైనా గర్భిణులు ద్యానం, వ్యాయామం చేయడం మానకూడదని సూచిస్తున్నారు.
News February 17, 2026
అణు చర్చల వేళ హార్ముజ్‌లో ఇరాన్ యుద్ధ విన్యాసాలు

అణు ఒప్పందంపై USతో చర్చలు ప్రారంభమైన వేళ ఇరాన్ తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. హార్ముజ్ జలసంధి లక్ష్యంగా ‘రెవల్యూషనరీ గార్డ్’ లైవ్-ఫైర్ విన్యాసాలు చేపట్టింది. తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన మిస్సైల్స్ జలసంధిలోని లక్ష్యాలను తాకినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉండే ఈ జలమార్గంలో విన్యాసాలు చేయడం ద్వారా ఇరాన్ ప్రపంచ దేశాలకు బలమైన సంకేతాలు పంపింది.
News February 17, 2026
BREAKING: ఐబొమ్మ రవికి బెయిల్

TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉ.11 గంటలకు సీపీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చిచెప్పింది. సినిమాల పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న రవి అరెస్టయిన విషయం తెలిసిందే.


