News January 24, 2025
విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో VSR పిటిషన్

AP: విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అనుమతి కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది. కాగా రాజకీయాలు వీడుతున్నట్లు VSR ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 13, 2025
కొత్త రూల్స్.. లేటైతే డబుల్ ఛార్జ్

FEB 17 నుంచి కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60min కంటే ఎక్కువ టైం FASTag ఇన్‌యాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 min తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.
News February 13, 2025
పర్యాటకంలో 20 శాతం వృద్ధి ఉండాలి: సీఎం

AP: పర్యాటక రంగ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందులో 20 శాతం వృద్ధి ఉండాలని సూచించారు. మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతి, రాజమండ్రిలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్, క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.
News February 13, 2025
పిల్లలకు థియేటర్ ఎంట్రీపై ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

TG: రా.11 నుంచి ఉ.11 లోపు థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై హైకోర్టు <<15284831>>ఆంక్షలు విధించడంపై<<>> అప్పీల్ పిటిషన్ దాఖలైంది. ఆ తీర్పుతో తాము నష్టపోతామని మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున అప్పీలుపై జోక్యం చేసుకోలేమని CJ బెంచ్ స్పష్టం చేసింది. ఆ పెండింగ్ పిటిషన్‌లోనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.