News October 6, 2025

VSSCలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(VSSC) 17 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే (OCT 6) ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సా. 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ME/MTech ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.750. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.vssc.gov.in/

Similar News

News March 27, 2026

‘థాంక్యూ ఇండియా’ అని మిస్సైల్‌పై రాసి..

image

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు మిస్సైళ్లతోనే ఇరాన్ సమాధానమిస్తోంది. ఈ క్రమంలో తమకు సంఘీభావం తెలిపిన దేశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు చెబుతోంది. ‘థాంక్యూ జర్మన్ పీపుల్. థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’ అంటూ క్షిపణులపై సందేశాలు రాసి మరీ ప్రయోగిస్తోంది. స్పెయిన్, పాక్‌కూ ఇలానే థాంక్స్ చెప్పినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌, గల్ఫ్ దేశాల్లోని US బేస్‌లపై ఈ దాడులు చేసినట్లు IRGC తెలిపింది.

News March 27, 2026

ఈ క్వాలిటీస్ ఉన్న మహిళలను పురుషులు ఇష్టపడతారు!

image

మహిళల్లోని కొన్ని క్వాలిటీలు పురుషులను ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ‘ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిని ఇష్టపడతారు. ఇండిపెండెంట్‌‌గా, దయతో ఉండే వారు నచ్చుతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల, తమ తప్పును ఒప్పుకోగల వారికి అట్రాక్ట్ అవుతారు. తమకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని, తాము కలగన్న వాటిని సాధించుకోవాలనుకునే వారిని పురుషులు లైక్ చేస్తారు’ అని చెబుతున్నారు.

News March 27, 2026

కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

image

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్‌డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.