News February 18, 2025
VVIP చాపర్ కేస్: మధ్యవర్తికి బెయిల్

అగస్టా వెస్ట్లాండ్ చాపర్ కేసులో బ్రిటన్ మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. CBI కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టు రెన్యువల్ చేసుకొని సబ్మిట్ చేయాలని ఆదేశించింది. పిటిషనర్ ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నారని, సప్లిమెంటరీ సహా 3 ఛార్జిషీట్లను CBI దాఖలు చేసిందని గుర్తుచేసింది. ట్రయల్ కోర్టు నిర్దేశించిన ఆంక్షలకు లోబడి, అనారోగ్య కారణాలతో ఊరటనిచ్చింది.
Similar News
News November 28, 2025
WPL వేలంలో అదరగొట్టిన తెలుగమ్మాయిలు

WPL 2026 వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ సత్తా చాటారు. గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ వారియర్స్, మమతను రూ.10 లక్షలకు ఢిల్లీక్యాపిటల్స్, క్రాంతిరెడ్డిని రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB జట్టు ఎంచుకుంది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.
News November 28, 2025
స్విగ్గీ, జొమాటో, జెప్టో గోడౌన్లలో ఇదీ పరిస్థితి

TG: హైదరాబాద్లో ఆన్లైన్ డెలివరీ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. స్విగ్గీ, జెప్టో, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు చెందిన 75 గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఎక్స్పైర్డ్, మిస్ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. కుళ్లిన ఫ్రూట్స్, కూరగాయలను గుర్తించారు. పలు వస్తువుల శాంపిల్స్ సేకరించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
News November 28, 2025
పృథ్వీరాజ్ ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు: తల్లి మల్లిక

పృథ్వీరాజ్ కెరీర్ను నాశనం చేసేలా సైబర్ అటాక్ జరుగుతోందని తల్లి మల్లిక ఆరోపించారు. అతను ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, సోషల్ మీడియాలో ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ పనులను ఆపేంత వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇటీవల పృథ్వీరాజ్ నటించిన విలయత్ బుద్ధ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. తెలుగులో వారణాసి చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.


