News February 18, 2025
VVIP చాపర్ కేస్: మధ్యవర్తికి బెయిల్

అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ కేసులో బ్రిటన్ మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. CBI కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకొని సబ్మిట్ చేయాలని ఆదేశించింది. పిటిషనర్ ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నారని, సప్లిమెంటరీ సహా 3 ఛార్జిషీట్లను CBI దాఖలు చేసిందని గుర్తుచేసింది. ట్రయల్ కోర్టు నిర్దేశించిన ఆంక్షలకు లోబడి, అనారోగ్య కారణాలతో ఊరటనిచ్చింది.
Similar News
News April 11, 2026
వెనక్కి తగ్గిన నువాన్ తుషార

IPLలో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు NOC ఇవ్వట్లేదని కోర్టుకెక్కిన నువాన్ తుషార వెనకడుగు వేశారు. కేసును వెనక్కి తీసుకోవడంతో పాటు బోర్డుకు సారీ చెప్పారు. గవర్నింగ్ బాడీని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని మెయిల్ పంపారు. బోర్డు తన పట్ల పారదర్శకంగా వ్యవహరించలేదని, న్యాయం కోసం అలా చేశానని పేర్కొన్నారు. SL బోర్డు NOC ఇవ్వకపోవడంతో RCBకి ప్రాతినిధ్యం వహించాల్సిన తుషార ఇంకా జట్టులో జాయిన్ కాలేదు.
News April 11, 2026
భారతీయుల ఇళ్లలో ₹462 లక్షల కోట్ల బంగారం!

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం నిల్వలు టాప్-10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వలను మించిపోయాయని అసోచామ్ వెల్లడించింది. మన ఇళ్లలో ఉన్న పసిడి విలువ సుమారు ₹462.25 లక్షల కోట్లని అంచనా. ఇందులో 2% నిధులు ఆర్థిక వ్యవస్థలోకి చేరినా దేశాభివృద్ధి వేగవంతమవుతుందని నివేదిక పేర్కొంది. 2025 నవంబర్ నాటికి గోల్డ్ లోన్ల విలువ ₹24.34 లక్షల కోట్లకు చేరింది. ఈ సంపదను ఉత్పాదక రంగంలోకి మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 11, 2026
ఎల్లుండి రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలపనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సోమవారం కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. అమరావతి ప్రాశస్త్యం, రాజధాని పనుల్లో పురోగతి తదితరాల గురించి తెలిపే బుక్‌ను ఈ సందర్భంగా రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన అమరావతి బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే.


