News February 26, 2026
VZM: ‘ఆ ఉద్యోగులకు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి’

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆదేశించారు. ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం పనివేళల ముగింపునకు ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మసీదులు, ముస్లిం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, బ్లీచింగ్ నిర్వహించాలన్నారు.
Similar News
News April 16, 2026
విజయనగరం: సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ

విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO&APC మాణిక్యం నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు దీనికి అర్హులన్నారు. ఏప్రిల్ 22 సా.5 గంటల లోపు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌లో సంబధిత వివరాలు ఉన్నాయని చెప్పారు.
News April 16, 2026
విజయనగరంలో రేపు జాబ్ మేళా..

విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్‌ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ టు డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై, 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12,600-రూ.20,000 పైగా వేతనం లభిస్తుందని తెలిపారు.
News April 16, 2026
VZM: అవినీతి..రూ.20 లక్షల గోల్ మాల్

బాడంగిలోని పలు గ్రామాలలో ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలలో గుర్తించారు. సామాజిక తనిఖీ ప్రజా వేదికను ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. మూడు క్లస్టర్లలో మస్టర్లు దిద్దుబాటు చేసి, పనికి రాకుండానే వచ్చినట్లు మస్టర్లు వేసి రూ. 20లక్షల వరకు స్వాహా చేసినట్లు డీఆర్పీలు వెల్లడించారు. అవినీతి సొమ్ము రికవరీ చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.


