News February 26, 2026

VZM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 508 గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షను 19,436 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 18,928 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 508 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.

Similar News

News April 15, 2026

VZM: ‘ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ’

image

ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బొత్స‌పై ఫ్లెక్సీలు వేయడంపై బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అనాడు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి బంగ్లా కారణం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడంలో బంగ్లాలోనే అంకురార్పణ జరిగిందన్నారు. బొత్స దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారన్నారు.

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో వెనబడిన విజయనగరం జిల్లా

image

ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> వెనుకబడ్డారు. ఫస్ట్ ఇయర్‌లో 16,984 మంది పరీక్షలు రాయగా 12,268 మంది పాసయ్యారు. 72 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16,456 మంది పరీక్షలు రాయగా 12,456 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.