News February 27, 2026
VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.
Similar News
News April 15, 2026
VZM: ‘ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ’

ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బొత్సపై ఫ్లెక్సీలు వేయడంపై బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అనాడు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి బంగ్లా కారణం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడంలో బంగ్లాలోనే అంకురార్పణ జరిగిందన్నారు. బొత్స దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారన్నారు.
News April 15, 2026
ఇంటర్ ఫలితాల్లో వెనబడిన విజయనగరం జిల్లా

ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> వెనుకబడ్డారు. ఫస్ట్ ఇయర్‌లో 16,984 మంది పరీక్షలు రాయగా 12,268 మంది పాసయ్యారు. 72 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16,456 మంది పరీక్షలు రాయగా 12,456 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.