News February 16, 2026
VZM: ‘జిల్లా ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి’

విజయనగరం జిల్లాలోని సాగు, త్రాగునీటి ప్రాజెక్టులను, కాలువలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిని ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు ఆదినారాయణ, రామారావు మాట్లాడుతూ..జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, సాగునీరు ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 17, 2026
VZM: పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వీసీ అనంతరం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నెలా 9వ తేదీలోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా పాసుపుస్తకాలు తయారు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. మ్యుటేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News March 17, 2026
విజయనగరం RDOగా సుధాసాగర్

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (SDC-LA)గా పనిచేస్తున్న సనపాల సుధాసాగర్‌ను విజయనగరం RDOగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ పరీక్షల్లో అవకతవలు జరిగాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. కేసు తేలేవరకు ఆ బ్యాచ్ అధికారులందరినీ బదిలీ చేయాలని న్యాయస్థానం తీర్పు మేరకు విజయనగరం RDO దాట్ల కీర్తీని బదిలీ చేసిన విషయం తెలిసిందే.
News March 17, 2026
VZM: ‘ఉగాది ఉత్సవాలు విజయవంతం చేయాలి’

ఈనెల 19న శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి దేవాలయంలో నిర్వహించనున్న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీఆర్వో సి.హెచ్.సత్తిబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. నాదస్వరం, వేదపండితుల ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.


