News March 29, 2025
ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ.300 నుంచి రూ.307కి పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రూ.7 పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమల్లోకి రానుంది.
Similar News
News January 19, 2026
పంతం పక్కనబెట్టి ఈ పనులు నేర్చుకోండోయ్!

నగరాలు, పట్టణాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన <<18865388>>డిమాండ్<<>> నెలకొంది. చిన్నపని చేసినా రూ.500-1,000 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఆ పనులు చేసేందుకు ఇష్టపడట్లేదు. సొసైటీలో తమ హోదా తగ్గుతుందని, వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తామంటున్నారు. ఆ పంతం పక్కనబెట్టి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణుల మాట. ఏమంటారు?
News January 19, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 19, 2026
బొగ్గు టెండర్ల పంచాయితీ.. నివేదిక కోరిన కేంద్రం!

ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. పాలసీ పరమైన లోపాలు జరిగినట్లు సమాచారం అందడంతో టెండర్ల ప్రక్రియ వివరాలు సమర్పించాలని సింగరేణిని కోరింది. సింగరేణిలో బొగ్గు మంత్రిత్వ శాఖకు 49%, తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉంది. బొగ్గు శాఖ నైనీ బ్లాకులను ఎస్సీసీఎల్కు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 2025లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.


