News September 10, 2024
సూర్యోదయం కంటే ముందే నిద్ర లేస్తున్నారా?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది లేటుగా నిద్ర లేస్తున్నారు. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యోదయానికి ముందే లేస్తే చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. యోగా, ధ్యానం, వ్యాయామం చేస్తే జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. ఉదయాన్నే మేల్కొంటే జీర్ణక్రియ సాఫీ ఉంటుంది. ఉదయం స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News October 4, 2024
అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న దేశాలు!
CEO వరల్డ్ మ్యాగజైన్ విడుదల చేసిన హెల్త్ కేర్ ఇండెక్స్-2024 ప్రకారం 100కి 78.72 స్కోరుతో తైవాన్ దేశం అత్యుత్తమ వైద్య సదుపాయాలను కలిగి ఉంది. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది అందుబాటుపై సర్వే చేసి ప్రతి దేశానికి స్కోరునిచ్చారు. దక్షిణ కొరియా(77.7), ఆస్ట్రేలియా(74.11), కెనడా(71.32), స్వీడన్(70.73) టాప్-5లో ఉన్నాయి. కాగా, ఇండియాకు 45.84 స్కోర్ లభించింది.
News October 4, 2024
విజయ్ ‘దళపతి 69’ షురూ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఖరి చిత్రం ‘దళపతి69’ పూజా కార్యక్రమం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2025లో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. హెచ్ వినోద్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తారు. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తారు. అనిరుధ్ సంగీతం అందిస్తారు.
News October 4, 2024
ఎవరు పెద్ద హీరో?.. సురేశ్ బాబు సమాధానమిదే
టాలీవుడ్లో బిగ్ స్టార్ ఎవరు? అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సురేశ్ బాబు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘కలెక్షన్ల ఆధారంగా హీరోల స్థాయిని నిర్ణయించలేం. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఏంతీసినా ప్రేక్షకులు చూస్తారని అనుకోకూడదు. వారి సినిమాలు కొన్ని అంచనాలను అందుకోలేదు. తెలుగులో రూ.100 కోట్లు సాధించే హీరోలు చాలామంది ఉన్నారు’ అని పేర్కొన్నారు.