News November 30, 2024
చేతిలో డబ్బుల్లేక సూసైడ్ చేసుకోవాలనుకున్నా: రాజేంద్రప్రసాద్

కెరీర్ ఆరంభంలో అవకాశాలు రాక, చేతిలో డబ్బుల్లేక 3 నెలలు అన్నం తినలేదని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సినిమాల్లోకి వెళ్తా అనడంతో నాన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే ఇంటికి రావొద్దన్నారు. ఒక దశలో వేషాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళితే డబ్బింగ్ అవకాశం వచ్చింది. దీంతో నా దశ తిరిగింది’ అని తెలిపారు.
Similar News
News January 21, 2026
ఆ ఉద్యోగుల శాలరీలు నేరుగా ఖాతాల్లోకి!

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో IFMIS విధానంలో నేరుగా ఖాతాల్లోకి జీతాలు చెల్లించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో హెచ్‌వోడీ, ఏజెన్సీల అకౌంట్లు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇది April నుంచి అమలయ్యేలా ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తోంది. కాగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
News January 21, 2026
SHOCKING: ఒకే రోజు రూ.5వేలు పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.5,020 పెరిగి రూ.1,54,800కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.4,600 ఎగబాకి రూ.1,41,900 పలుకుతోంది. అటు సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 21, 2026
చీనీ, నిమ్మలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు (ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.


