News May 19, 2024
బరువు పెరగాలనుకుంటున్నారా?
చాలామంది బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ కొంతమంది బరువు పెరగాలని ఆరాటపడుతుంటారు. కొన్ని పద్ధతులు పాటిస్తే బరువు పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే రెడ్ మీట్ తింటే బరువు పెరుగుతారు. పాలల్లో ఓట్స్, హోల్ గ్రెయిన్స్ కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. పీనట్ బటర్‌ను బ్రెడ్‌తో కలిపి తింటే బరువు పెరగొచ్చు. మామిడి, బొప్పాయి, పైనాపిల్, ఆవకాడో పండ్లు తింటే బరువు పెరుగుతారు.
Similar News
News December 3, 2024
ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘బ్రెయిన్ రాట్’
‘బ్రెయిన్ రాట్’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది. బ్రెయిన్ రాట్ అంటే మానసిక స్థితి క్షీణించడం, గతి తప్పడం. సోషల్ మీడియాలో అవసరం లేని కంటెంట్‌ను ఎక్కువ చూడటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ ప్రయోజనం లేకుండానే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ కాలం గడిపేసేవారికీ ఈ పదం వర్తిస్తుంది. ఈ ఏడాదిలో ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
News December 3, 2024
వలస కార్మికులకు అండగా ఉంటాం: రామ్మోహన్ నాయుడు
AP: విదేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బాధితులకు ఇండియాకు రప్పించేందుకు విదేశాంగశాఖ సహాయం కోరతామని చెప్పారు. వారికి అవసరమైన ఫుడ్, ఇతర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, వజ్రపుకొత్తూరు, కంచిలి, నందిగాంకు చెందిన దాదాపు 30 మంది వలస కార్మికులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.
News December 3, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.