News October 31, 2024
రాజకీయాలు వదిలేద్దామనుకున్నా: KTR
తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని అయితే పోరాడాలని నిర్ణయించుకుని నిలబడినట్లు చెప్పారు. Xలో నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుత రాజకీయాలు ఏం బాలేవని అన్నారు. పాలిటిక్స్‌లో కుటుంబ సభ్యుల్ని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయలేదని చెప్పారు.
Similar News
News November 13, 2024
వచ్చే జనవరిలో క్రెటా ఈవీ లాంచ్
భారత్‌లో తమ మూడో విద్యుత్ కారును తీసుకొచ్చేందుకు హ్యుందాయ్ రంగం సిద్ధం చేసింది. సంస్థకు చెందిన కోనా, ఐయోనిక్-5 ఈవీలు ఇప్పటి వరకు మార్కెట్లో ఉండగా క్రెటా ఈవీని వచ్చే ఏడాది జనవరిలో హ్యుందాయ్ లాంఛ్ చేయనుంది. లీకైన లుక్స్ బట్టి ఈ ఈవీ స్టైలింగ్ అంతా స్టాండర్డ్ క్రెటాలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈవీ సెగ్మెంట్‌లో క్రెటాతో మార్కెట్ షేర్ దక్కించుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.
News November 13, 2024
రేపు అన్ని జిల్లాల్లో ఉద్యోగుల నిరసనలు
TG: వికారాబాద్(D) లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి నిరసనగా రేపు ఆందోళనలు చేయాలని ఉద్యోగుల ఐకాస నిర్ణయించింది. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రేపు ఆందోళనలు చేపట్టాలని, లంచ్ టైమ్‌లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు లగచర్ల దాడి ఘటనను ఐఏఎస్ అధికారుల సంఘం సీరియస్‌గా తీసుకుంది. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
News November 13, 2024
గుండె ఆరోగ్యం పెరగాలంటే ఇలా చేయండి!
శీతాకాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని శారీరక వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ చేయడం వల్ల గుండె వ్యాధులకు కారణమయ్యే కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. జాగింగ్/ రన్నింగ్ చేస్తే హృదయనాళ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సైక్లింగ్ వల్ల కీళ్లకు మేలు జరుగుతుంది. యోగాతో ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల హృదయనాళ వ్యవస్థ & కండరాల ఆరోగ్యం పెరుగుతుంది. SHARE IT