News February 18, 2025

వ్యాయామం చేయకుండానే ఫిట్‌గా ఉండాలా?

image

కసరత్తులతో చెమటలు చిందించకుండానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, సీడ్స్, ప్రోటీన్ పదార్థాలు తినాలి. షుగర్, ఫ్రై, ప్రాసెస్‌డ్ ఫుడ్ తినకూడదు. అలాగే లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, పార్కులో నడవడం వల్ల కేలరీలు కరిగి శరీరం ఫిట్‌గా మారుతుంది. తగినన్ని నీళ్లు తాగి, తగినంత నిద్ర పోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

Similar News

News March 11, 2026

పొద చిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

image

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

News March 11, 2026

పొట్టను దాస్తూ అలసిపోయా.. తగ్గి చూపిస్తా: KTR

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటోను Xలో షేర్ చేశారు. తన పొట్టను దాస్తూ అలసిపోయానని, 6 నెలల విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో కసరత్తు మొదలుపెట్టానని ఆయన రాసుకొచ్చారు. జులైలో తనకు 50 ఏళ్లు రానున్నాయని, ఆ నాటికి స్లిమ్‌గా మారతానంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా విజయ్ దేవరకొండ రిసెప్షన్‌లో కేటీఆర్ తన పొట్టను దాస్తూ సరదాగా కామెంట్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

News March 11, 2026

20 నెలల్లో సూపర్ సిక్స్‌ సూపర్ హిట్: CBN

image

AP: 20 నెలల్లో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘సూపర్ సిక్స్‌తో పాటు ఇతర పథకాలూ అమలు చేశాం. ఎక్కడా చిన్న తప్పు లేకుండా ముందుకెళ్తున్నాం. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ, 2.50 లక్షల గృహప్రవేశాలు చేయిస్తున్నాం. అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఫర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే ముందుకు వెళ్లలేం’ అని తెలిపారు.