News April 27, 2024
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: జో బైడెన్
ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘1972లో ఓ కారు ప్రమాదంలో నా భార్య, కుమార్తె కన్నుమూశారు. దాంతో మద్యానికి పూర్తిగా బానిసైపోయాను. నదిలోకి దూకాలన్న పిచ్చి ఆలోచనలు వచ్చేవి. కానీ నా ఇద్దరు కుమారులు గుర్తొచ్చి ఆగిపోయేవాడిని’ అని వెల్లడించారు. 1977లో జిల్ బైడెన్‌ను పెళ్లి చేసుకున్న జో, అప్పటి నుంచి ఆమెతో వైవాహిక బంధంలో కొనసాగుతున్నారు.
Similar News
News November 7, 2024
మహిళలకు ప్రతినెలా రూ.3వేలు: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ (MVA) ఐదు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతోపాటు రైతులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు.
News November 7, 2024
చాహల్‌పై చిన్న చూపెందుకు?
టీమ్ఇండియా బౌలర్ చాహల్‌కు గడ్డుకాలం నడుస్తోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి అదరగొట్టే చాహల్‌కు ప్రస్తుతం ఛాన్సులే రావట్లేదు. దీంతో IPLలో, Tటీ20ల్లో చాహల్ ప్రతిభను గుర్తించట్లేదని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. RCB,RR తరఫున చాహల్ (139, 66) అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టు నుంచి రిలీజ్ చేశారని మండిపడుతున్నారు. T20 క్రికెట్లోనూ అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టులో చోటు ఇవ్వట్లేదంటున్నారు. మీ కామెంట్?
News November 7, 2024
16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ చట్టం: AUS PM
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో చట్టం ప్రవేశపెడతామని, ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయని తెలిపారు. మన దగ్గర ఇలాంటి చట్టం వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.