News August 27, 2024
పాకిస్థాన్‌లో ఆడాలని ఉంది: కుల్దీప్ యాదవ్
BCCI అనుమతిస్తే పాకిస్థాన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతామని టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నారు. ‘మేం క్రికెటర్లం కాబట్టి ఏ దేశానికి పంపినా అక్కడ ఆట ఆడతాం. ఇంతకుముందెన్నడూ నేను పాక్‌కు వెళ్లలేదు. అందుకే ఈ టూర్ కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అవకాశమిస్తే పాక్ వెళ్లి ఆడుతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేదిలేదని BCCI ఇప్పటికే తేల్చిచెప్పింది.
Similar News
News September 19, 2024
జమిలి ఎన్నికలపై పార్టీల స్టాండ్ ఏంటి?
జమిలి ఎన్నికలపై రాంనాథ్ కోవింద్ ప్యానెల్ 62 పార్టీల అభిప్రాయాలను కోరగా 47 పార్టీలే స్పందించాయి. అందులో 32 అనుకూలంగా, 15 పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. బీజేపీ, NPP, అన్నాడీఎంకే, అప్నాదళ్, అసోం గణ పరిషత్, బిజూ జనతాదళ్, శివసేన, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతిచ్చాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, సీపీఎం, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వ్యతిరేకించాయి. టీడీపీ, వైసీపీ, BRS స్పందించలేదు.
News September 19, 2024
దేశీయ స్టాక్ మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్
US ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఎనర్జీ, మోటార్, ఫైనాన్స్ రంగ షేర్లు లాభాలతో ఓపెన్ అయ్యాయి. ఐటీ, స్టీల్ రంగ షేర్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.
News September 19, 2024
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.