News October 11, 2024
సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం!
బారామతికి సంబంధించి శరద్ పవార్ పంపిన ప్రతిపాదనలను CM ఏక్‌నాథ్ శిండే క్యాబినెట్ ముందుంచడంపై Dy.CM అజిత్ కినుక వహించినట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో వీరిద్దరి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. శిండే ప్రవేశపెట్టిన అంశాల ఆమోదానికి అజిత్ నిరాకరించారని, అనంతరం మీటింగ్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, అజిత్ దీన్ని ఖండించారు.
Similar News
News November 3, 2024
కెనడా రాజకీయాల్లో హిందువుల ప్రాతినిధ్యం పెరగాలి: చంద్ర ఆర్య
కెనడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ మంది హిందువులు భాగస్వామ్యం అయ్యేలా రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం పెరగాలని కెనడియన్ MP చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. Hindu Heritage Month సందర్భంగా Parliament Hillలో ఆయన కాషాయ జెండాను ఎగురవేశారు. కెనడాలో మూడో అతిపెద్ద మత సమూహమైన హిందువులు దేశ వృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, అదేవిధంగా రాజకీయాల్లో కూడా క్రీయాశీలకంగా ఉండాలని పిలుపునిచ్చారు.
News November 3, 2024
HOPE: 11 దేశాలపై శతకాలు బాదేశాడు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షయ్ హోప్ (117) శతకంతో మెరిశారు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన హోప్ ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 127 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 117 పరుగులు బాదారు. ఇప్పటివరకు ఆయన 11 దేశాలపై సెంచరీలు చేశారు. కార్టీ (71), రూథర్‌ఫర్డ్ (54) కూడా రాణించడంతో ఓవర్లన్నీ ఆడి విండీస్ 328/6 రన్స్ సాధించింది.
News November 3, 2024
నవంబర్ 3: చరిత్రలో ఈరోజు
* 1874: సాహితీవేత్త, నాటకరంగ ప్రముఖుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి మరణం
* 1906: బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ పృథ్వీరాజ్ కపూర్ జననం
* 1933: నోబెల్ బహుమతి పొందిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ పుట్టినరోజు
* 1937: ప్రముఖ సింగర్ జిక్కి జయంతి
* 1940: విప్లవ రచయిత వరవరరావు పుట్టినరోజు
* 1998: విలక్షణ నటుడు పీఎల్ నారాయణ మరణం