News August 30, 2024

పారాలింపిక్స్‌లో వరంగల్ పరుగుల రాణి!

image

పారిస్‌ పారాలింపిక్స్‌లో వరంగల్(TG) జిల్లా కల్లెడకు చెందిన దీప్తి పాల్గొంటున్నారు. మానసిక ఎదుగుదల సమస్యతో బాధపడుతున్న ఆమె పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్నారు. దీప్తికి చిన్నప్పుడే ఫిట్స్ సమస్య వచ్చిందని, ముఖం చిన్నగా ఉంటుందని ఆమె తల్లి చెప్పారు. దీప్తిని తోటివారు కోతిపిల్లా అని ఎగతాళి చేయడంతో ఏడ్చేదని గుర్తుచేశారు. ఇటీవలే జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించారు.

Similar News

News September 20, 2024

విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించారు. సొంత గడ్డపై అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన 12,000 పరుగుల మైలురాయి చేరుకుని ఈ ఫీట్ సాధించారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (14,192) ఉన్నారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ (13,117), జాక్వెస్ కలిస్ (12,305), కుమార సంగక్కర (12,043) నిలిచారు.

News September 20, 2024

నిఫ్టీ 50లో 44 స్టాక్స్ బులిష్‌

image

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోబుల్ జోర్ వ‌ల్ల నిఫ్టీ-50లోని 44 స్టాక్‌లు శుక్ర‌వారం లాభాలు గ‌డించ‌డం గ‌మ‌నార్హం. అధిక వెయిటేజీ గ‌ల‌ ICICI రూ.1,362కి ఎగ‌బాకి 52 వారాల హైకి చేరింది. HDFC (1.68%) ద‌న్నుగా నిల‌వ‌డంతో దేశీయ సూచీలు గ‌రిష్ఠాల‌కు చేరుకున్నాయి. M&M, ICICI, JSW Steel, L&T, కోల్ ఇండియా టాప్ గెయిన్స్‌గా నిలిచాయి. ఆటో(1.9%), బ్యాంక్‌(1.4%), ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌(1.6%) వృద్ధి చెందాయి.

News September 20, 2024

CM గారూ.. మీ వ్యాఖ్యలు చాలా ప్రభావవంతం: మహీంద్రా

image

TG: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విషయంలో CM రేవంత్‌ను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ‘ఆ సదస్సుకు హాజరుకావడం సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్‌ తన ఆలోచనల్ని ఆచరణలోకి పెట్టడాన్ని చూసి ఎంజాయ్ చేశాను. రేవంత్.. మీరు తక్కువే మాట్లాడినా అవి చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఎలా పనిచేయాలన్నదానికి బలమైన ఉదాహరణ ఇచ్చారు మీరు’ అని పేర్కొన్నారు.