News July 15, 2024
వార్నర్‌ను పరిగణనలోకి తీసుకోం: బెయిలీ
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్నర్‌ను వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోబోమని ఆస్ట్రేలియా సెలక్టర్ బెయిలీ స్పష్టం చేశారు. అతని కెరీర్ విజయవంతంగా సాగిందన్నారు. మూడు ఫార్మాట్లకు ఆయన సేవలు అందించినా ప్రస్తుతం జట్టు వేర్వేరు ఆటగాళ్లతో వెళ్తోందని తెలిపారు. అంతకుముందు జట్టుకు అవసరమైతే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని వార్నర్ చెప్పారు.
Similar News
News October 12, 2024
‘దసరా’ పూజకు సరైన సమయమిదే..
విజయదశమి రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందుకాలాన్ని విజయ ముహూర్తంగా చెబుతారు. ఆ సమయంలో శమీవృక్షా(జమ్మిచెట్టు)న్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని ‘అగ్నిగర్భ’ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని అర్థం. దీనికే ‘శివా’ అనే మరో పేరుంది. అంటే సర్వశుభకరమైనదని. ‘మహాభారతం’ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచారు.
News October 12, 2024
కాలేజీలు బంద్ చేస్తే చర్యలు: రిజిస్ట్రార్ హెచ్చరిక
TG: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తే చర్యలు తప్పవని OU రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని పలు కాలేజీల యాజమాన్యాలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించడంతో ఆయన స్పందించారు. డిగ్రీ, పీజీ అకడమిక్ సెమిస్టర్ పరీక్షలు, గ్రూప్-1,2,3 ఉద్యోగాలు, ఇతర రాత పరీక్షలు ఉన్నందున కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారని చెప్పారు.
News October 12, 2024
టాటా ట్రస్ట్స్ కొత్త ఛైర్మన్ నేపథ్యం ఇదీ..
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా ఎంపికైన నోయల్ టాటా రతన్ టాటా సవతి తల్లి కొడుకు. రతన్ తండ్రి నావల్ హెచ్ టాటా తొలుత సూనూ కమిశారియట్‌ను పెళ్లాడారు. వీరికి రతన్, జిమ్మీ జన్మించారు. ఆ తర్వాత నావల్ సిమోన్ హెచ్ టాటాను వివాహమాడగా వారికి నోయల్ పుట్టారు. రతన్, జిమ్మీ ఇద్దరూ అవివాహితులే. నోయల్ భార్య ఆలూ మిస్త్రీ షాపూర్‌జీ పల్లోంజీ అధినేత పల్లోంజీ మిస్త్రీ కుమార్తెనే. సైరస్ మిస్త్రీకి స్వయానా సోదరి.