News November 14, 2024
ప్రభుత్వానికి గ్రూప్-4 అభ్యర్థుల హెచ్చరిక
TG: త్వరలో గ్రూప్-4 ఫలితాలు వస్తాయనే వార్తల నేపథ్యంలో బ్యాక్లాగ్ పోస్టులు మిగిల్చితే మెరుపు ధర్నా చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. ‘గ్రూప్-4లో అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా రిజల్ట్స్ ఇస్తే ఆందోళనలు చేస్తాం. దీనిపై గతంలోనే మంత్రులు, ప్రభుత్వ పెద్దలను కలిశాం. గురుకుల ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ పోస్టులు మిగలడంతో 2000 మందికి అన్యాయం జరిగింది. గ్రూప్-4లో అలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలి’ అని కోరారు.
Similar News
News December 4, 2024
‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్‌గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన ‘సీజ్ ద షిప్’ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ వాక్యం వైరలవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు.
News December 4, 2024
అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి: జగన్
AP: కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ ‘సూపర్ 6 అమలుపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్య శ్రీ బకాయిలు, 104, 108 సిబ్బందికి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెంచారు. ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఆరోపించారు.
News December 4, 2024
WTC: తొలి రెండు స్థానాల్లో IND, SA
WTC పాయింట్స్ టేబుల్లో టీమ్ ఇండియా తొలి స్థానంలో కొనసాగుతోంది. SA రెండో స్థానానికి ఎగబాకగా, AUS మూడో స్థానానికి పడిపోయింది. తర్వాతి స్థానాల్లో వరుసగా SL, NZ, ENG, PAK, BAN, WI ఉన్నాయి. IND, SA, AUSలో ఏవైనా రెండు జట్లు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. BGT సిరీస్ తర్వాత దీనిపై స్పష్టత రానుంది. WIపై BAN గెలవడం, స్లో ఓవర్ రేట్ కారణంగా NZ, ENGకు పాయింట్లలో ICC కోత విధించడంతో ర్యాంకింగ్స్ మారాయి.