News December 2, 2024
ఆ తప్పువల్ల బెడ్‌కే పరిమితమయ్యా: రకుల్

హెవీ వర్కవుట్ (80 కిలోల బరువు ఎత్తడం) చేయడం వల్ల తన వెన్నెముకకు గాయమైందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆ తప్పు వల్ల రెండు వారాలు బెడ్‌కే పరిమితమయ్యానని ఆమె చెప్పారు. ‘అక్టోబర్ 5న వర్కౌట్ చేస్తుంటే వెన్నులో నొప్పి మొదలైంది. వర్కౌట్ తర్వాత మూవీ షూటింగ్‌కు కూడా వెళ్లా. దీంతో నొప్పి తీవ్రం కావడంతో పది రోజులు ఆస్పత్రిపాలయ్యా. నా బర్త్ డే పార్టీ కూడా చేసుకోలేకపోయా’ అంటూ రకుల్ చెప్పుకొచ్చారు.
Similar News
News February 12, 2026
T20 WC: భారత్ భారీ స్కోర్

నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209/9 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ (52) రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. 19వ ఓవర్లో భారత్ 3 వికెట్లు(పాండ్య, దూబే, అక్షర్) కోల్పోవడంతో స్కోర్ కాస్త తగ్గింది.
News February 12, 2026
‘ఆయుష్’లో త్వరలో 358 పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్

AP: ఆయుష్ శాఖలో వివిధ కేటగిరీల్లో నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 358 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీటిలో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్, మల్టీపర్పస్ వర్కర్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం’ అని వివరించారు.
News February 12, 2026
‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.


