News July 31, 2024

వయనాడ్ విలయానికి కారణమిదేనా?

image

కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో 123 మంది మరణించారు. వందల మంది గల్లంతయ్యారు. ఈ విషాదానికి అరేబియా సముద్రం వేడెక్కడం ఓ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘కేరళలో 2 వారాలుగా కురుస్తున్న వర్షాలతో నేల తేమగా మారింది. వేడిగాలుల వల్ల అరేబియా తీరంలో తక్కువ సమయంలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలకు కొండచరియలు విరిగిపడ్డాయి’ అని పేర్కొంటున్నారు.

Similar News

News October 7, 2024

DMK vs పవన్ కళ్యాణ్

image

డీఎంకే, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇటీవల తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం, ఉదయనిధి స్టాలిన్‌కు కౌంటర్ వేయడంపై డీఎంకే ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు పవన్‌పై అడ్వకేటుతో ఫిర్యాదు చేయించడం, ప్రకాశ్ రాజ్‌‌తో ట్వీట్లు పెట్టించడం DMK పనేనని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

News October 7, 2024

రూ.14వేల ఇసుక రూ.21వేలకు చేరింది: బొత్స

image

AP: రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పని లేక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ హయాంలో విశాఖలో 10 టన్నుల ఇసుక రూ.14వేలకు దొరికేదని, ప్రస్తుతం అది రూ.21వేలకు చేరిందని విమర్శించారు. కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఫైరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ ఆపాలని డిమాండ్ చేశారు.

News October 7, 2024

మూడు పూటల కష్టం.. ఫలితం 33 పైసలు

image

వినియోగదారులు చెల్లించే ధరలో కూరగాయలు, పండ్ల రైతులు 30% మాత్రమే పొందుతున్నారని RBI ఓ రిపోర్టులో పేర్కొంది. అంటే మనం KG ₹100కు కొంటే వారికి ₹30 దక్కుతోంది. మిగతాది దళారులు, టోకు వర్తకులు, రిటైల్ వ్యాపారులు వంటి వారికి వెళ్తోంది. కొన్ని పంటలు చూస్తే టమాటాలకు 33%, ఆలూ- 37%, అరటి- 31%, మామిడి: 43%, ద్రాక్ష: 35% చొప్పున శ్రమజీవికి చెందుతోంది. ఇక డెయిరీ, గుడ్ల రైతులకు మాత్రం ఇది 70%, 75% కావడం గమనార్హం.