News January 6, 2025
20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి: సీఎం
AP: చైనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రజలంతా శుభ్రత పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు 20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ICMR అధీకృత వైరాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 3వేల hMPV టెస్టింగ్ కిట్లను, ఔషధాలను రెడీగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ పైపులైన్లపై మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
Similar News
News January 14, 2025
రూపాయి పతనం కొంత కాలమే: SBI రిపోర్ట్
భారత రూపాయి పతనంపై ట్రంప్ ప్రభావం కొంత కాలమే ఉంటుందని SBI రిపోర్ట్ పేర్కొంది. ఆయన ప్రెసిడెన్సీ ఆరంభంలో మన కరెన్సీకి ఒడుదొడుకులు ఎదురైనా త్వరలోనే స్థిరత్వం సాధిస్తుందని అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాంలోనే INR మెరుగ్గా రాణించిందని 2013 నాటి ‘టేపర్ తంత్రం’ను గుర్తుచేసింది. NOV నుంచి రూపాయి 3% బలహీనపడినా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇది అతి కనిష్ఠమని తెలిపింది.
News January 14, 2025
పండగ రోజు ఏ సినిమాకు వెళ్తున్నారు?
సంక్రాంతి పండగ రోజూ అందరూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారు. ఫ్యామిలీతో సినిమాలకు వెళ్తుంటారు. ఈ సారి సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలు ‘గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలోకి వచ్చేశాయి. ఏ సినిమా ఎలా ఉందో టాక్ కూడా తెలిసిపోయింది. మరి మీరు ఈరోజు వీటిలో ఏ మూవీకి వెళ్తున్నారు? కామెంట్ చేయండి.
News January 14, 2025
ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్
ISRO ఛైర్మన్‌గా డా.వి.నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మాజీ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో PhD, క్రయోజనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేసిన నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. ఈ ఏడాదితో ఇస్రోలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆదిత్య L1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 వంటి చరిత్రాత్మక ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు.