News August 5, 2024

‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో వాషింగ్టన్, స్మృతి, షెఫాలీ

image

గత నెల ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు అభ్యర్థుల్ని ఐసీసీ ప్రకటించింది. వీరిలో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(జింబాబ్వే, శ్రీలంకలో ప్రదర్శన), ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్‌సన్(వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌లో ప్రదర్శన), స్కాట్లాండ్‌కు చెందిన చార్లీ కాసెల్(ఒమన్‌పై ప్రదర్శన) ఉన్నారు. ఇక మహిళా క్రికెటర్లలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, శ్రీలంక బ్యాటర్ చామరి ఆటపట్టు ఉన్నారు.

Similar News

News March 26, 2026

రేపు సెలవు

image

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం శుక్రవారాన్ని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు బ్యాంకులకు సైతం సెలవు ఉంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు పని చేయవు. దీంతో ఈ రోజే బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్.

News March 26, 2026

ఇరాన్‌పై విరుచుకుపడండి.. నెతన్యాహు ఆదేశం

image

అమెరికా-ఇరాన్ డీల్ పూర్తి కాక ముందే ఇరాన్‌పై విరుచుకుపడాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్)ను ఆదేశించారు. ఇరాన్ ఆయుధ ఇండస్ట్రీలను 48 గంటల్లో నాశనం చేయాలని బంకర్ నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ఇరాన్ నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది.

News March 26, 2026

‘ఖర్గ్’ స్వాధీనానికి US ప్లాన్.. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

image

ఇరాన్‌కు చెందిన <<19378419>>ఖర్గ్ ద్వీపాన్ని<<>> స్వాధీనం చేసుకునేందుకు అమెరికా బలగాలు ప్రయత్నిస్తున్నట్లు CNN తెలిపింది. దీంతో ఇరాన్ అప్రమత్తమై భారీ ఎత్తున బలగాలను సిద్ధం చేస్తోందని పేర్కొంది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబఫ్ సైతం స్పందించారు. ‘మా పక్క దేశంతో కలిసి శత్రువులు కుట్ర చేస్తున్నారు. అన్నీ గమనిస్తున్నాం. వాళ్లు అటాక్ చేస్తే ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తాం’ అని హెచ్చరించారు.