News August 5, 2024
‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో వాషింగ్టన్, స్మృతి, షెఫాలీ

గత నెల ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు అభ్యర్థుల్ని ఐసీసీ ప్రకటించింది. వీరిలో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(జింబాబ్వే, శ్రీలంకలో ప్రదర్శన), ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్‌సన్(వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌లో ప్రదర్శన), స్కాట్లాండ్‌కు చెందిన చార్లీ కాసెల్(ఒమన్‌పై ప్రదర్శన) ఉన్నారు. ఇక మహిళా క్రికెటర్లలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, శ్రీలంక బ్యాటర్ చామరి ఆటపట్టు ఉన్నారు.
Similar News
News December 17, 2025
ఆస్కార్ 2026 షార్ట్‌లిస్ట్‌లో ‘హోమ్‌బౌండ్’

భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ మూవీ 98వ అకాడమీ అవార్డులలో ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో టాప్-15లో చోటుదక్కించుకుంది. కేన్స్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ రేసులోకి దూసుకెళ్లింది. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు స్నేహితులకు ఎదురైన సవాళ్లే ఈ మూవీ కథ.
News December 17, 2025
రూ.లక్ష రుణం పొందడానికి అర్హతలు ఏమిటి?

AP: కౌలు రైతులు రూ.లక్ష వరకు రుణం పొందాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ, వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు, వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
News December 17, 2025
ఫ్లాట్‌గా మొదలై లాభాల వైపు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలై లాభాల వైపు పయనిస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 84,843 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు వృద్ధి చెంది 25,913 వద్ద కొనసాగుతోంది. యాక్సిక్ బ్యాంక్, ఎస్బీఐ, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, మారుతి, టాటా స్టీల్, ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.


