News September 14, 2024

తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!

image

భారత పర్యాటకానికి తలమానికమైన తాజ్‌మహల్‌లో నీరు కారుతోంది. ఆగ్రాలో గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన డోమ్ నుంచి నీరు లీకవుతోందని పురావస్తు అధికారులు గుర్తించారు. అయితే పెద్దగా సమస్యలేవీ కనిపించలేదని, వెంట్రుకవాసి పరిమాణంలో ఓ బీటను గుర్తించామని తెలిపారు. డ్రోన్ సాయంతో దాన్ని నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే తగిన మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 3, 2024

ఈనెల 6 నుంచి కాలేజీలకు దసరా సెలవులు

image

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈనెల 6 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. హాలిడేస్ 13 వరకు కొనసాగుతాయని, కళాశాలలు తిరిగి 14న పున:ప్రారంభం అవుతాయని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.

News October 3, 2024

ధర్మారెడ్డి ఎక్కడ?: పవన్

image

AP: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మాత్రమే బయటకొచ్చి మాట్లాడుతున్నారన్నారు. తన బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి వచ్చిన ధర్మారెడ్డి లడ్డూ వివాదం రాగానే మాయమయ్యారని ఆక్షేపించారు. ఆయనపై చాలా ఆరోపణలున్నాయని, అన్నింటినీ బయటకు తీస్తామని చెప్పారు. తాను బాధ్యతలు తీసుకున్నప్పుడు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రస్తుత ఈవో చెప్పారన్నారు.

News October 3, 2024

USCIRF మత స్వేచ్ఛ నివేదికను తోసిపుచ్చిన భారత్

image

భార‌త్‌లో మ‌త స్వేచ్ఛ‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం (USCIRF) ఇచ్చిన నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. దీన్ని ఏక‌ప‌క్ష, రాజ‌కీయ ప్రేరేపిత నివేదిక‌గా పేర్కొంది. ఈ నివేదిక USCIRFని మరింత అప్రతిష్ఠపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని దుయ్య‌బ‌ట్టింది. USలో మానవ హక్కుల సమస్యల పరిష్కారానికి USCIRF తన సమయాన్ని వినియోగించుకోవాలని స‌ల‌హా ఇచ్చింది.