News March 10, 2025
ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి నిల్వలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా ఏపీ జలదోపిడీ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌లో 29.27 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 8.35 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 22.34 టీఎంసీలే ఉన్నాయి.
Similar News
News March 11, 2026
జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News March 11, 2026
ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి రూ.6,000

AP: పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలు డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది.
News March 11, 2026
ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.


