News April 3, 2024
వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్న నీటి గుంటలు

TG: మండు వేసవిలో నీరు దొరక్క వన్య ప్రాణులు అల్లాడిపోతున్నాయి. వీటి కోసం తెలంగాణ అడవులలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో జీవాలు గొంతు తడుపుకుంటున్నాయి. పులి, జింకలు, అడవి దున్నలు, హైనాలు నీటి కుంటల్లో దాహార్తిని తీర్చుకుంటున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కగా.. వీటిని అటవీ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వన్యప్రాణులు కోసం అధికారులు తీసుకుంటున్న చర్యల్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Similar News
News April 22, 2025
RESULTS: ఫస్ట్ ర్యాంక్ ఈమెకే

మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. తాజా సివిల్స్ ఫలితాల్లో యూపీ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు.
News April 22, 2025
TDP MLAలను చెప్పులతో కొడతారు: రోజా

AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని YCP నేత రోజా ఆరోపించారు. TDP MLAలు ప్రజల్లోకి వెళ్తే చెప్పులతో కొడతారని ఆమె విమర్శించారు. ‘చేతకాని హామీలు ఇచ్చి రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. హామీలు అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లిక్కర్‌స్కామ్‌లో మిథున్ రెడ్డిని అక్రమంగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై PM మోదీ స్పందించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
News April 22, 2025
నిషేధం వార్తలపై స్పందించిన హర్ష భోగ్లే

IPLలో ఈడెన్ గార్డెన్ మ్యాచులకు తనను నిషేధించారన్న వార్తల్ని వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఖండించారు. కోల్‌కతాలో జరిగే 2 మ్యాచులకు మాత్రమే తనను ఎంపిక చేశారని, ఆ రెండూ పూర్తయ్యాయని వివరించారు. KKRకు ఈడెన్ గార్డెన్స్‌లో హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ దక్కడం లేదని సైమన్ డౌల్, హర్ష భోగ్లే అన్నారు. దీంతో వీరిని కోల్‌కతాలో జరిగే మ్యాచులకు దూరం పెట్టాలని BCCIని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోరినట్లు వార్తలు వచ్చాయి.