News September 9, 2025

Way2News కాన్‌క్లేవ్: వైసీపీ నుంచి బుగ్గన, సజ్జల

image

AP: విజయవాడ CK కన్వెన్షన్‌లో ఈనెల 12న <<17649043>>Way2News కాన్‌క్లేవ్<<>> జరగనుంది. ఈ సదస్సుకు వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే పదేళ్లకు గాను తమ ఆలోచనలు పంచుకోనున్నారు. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న తొలి కాన్‌క్లేవ్ ఇదే.

Similar News

News September 10, 2025

నేపాల్‌లో శాంతికి పిలుపునిచ్చిన మోదీ

image

నేపాల్‌లో యువత ఆందోళనలతో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మోదీ X వేదికగా స్పందించారు. ‘నేపాల్‌లో చోటుచేసుకున్న హింస హృదయవిదారకం. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి పరిస్థితులపై సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ చర్చించింది. నేపాల్‌లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. శాంతికి మద్దతివ్వాలని నేపాలీ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పిలుపునిచ్చారు.

News September 10, 2025

ఉదయం అలారం పెట్టుకుని లేస్తున్నారా?

image

ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే సమయానికి నిద్ర లేవాలంటే అలారం తప్పనిసరిగా మారిపోయింది. అయితే అలారం శబ్దంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో రీసెర్చర్ కిమ్ చేసిన ప్రయోగంలో ఈ విషయాన్ని గుర్తించారు. సాధారణంగా మేల్కొనే వారికంటే అలారం వాడే వారిలో BP పెరుగుదల 74% అధికంగా ఉందని, స్ట్రోక్ రిస్క్ ఎక్కువని వెల్లడించారు.

News September 9, 2025

ఆర్మీ చేతుల్లోకి పాలన.. నేపాల్‌లో హై అలర్ట్

image

నేపాల్‌లో యువత ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇవాళ రాత్రి గం.10PM నుంచి లా&ఆర్డర్‌ను చేతుల్లోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలో హై అలర్ట్ విధించింది. ఆందోళనలను ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు ప్రజా ఆస్తులు ధ్వంసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నాయంది. అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. పరిస్థితులపై సమీక్షించి అప్డేట్స్ ఇస్తామని వెల్లడించింది.