News August 3, 2024

Wayanad Landslide: ఎకో సెన్సిటివ్ జోన్‌గా 57వేల SqKM

image

పశ్చిమ కనుమల్లో 56825 SqKM ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా (ESA) ప్రతిపాదిస్తూ కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. <<13762066>>వయనాడ్‌<<>> జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డ నూల్‌పుళ సహా కేరళలో 9993 SqKM దీని పరిధిలోకి వస్తుంది. జులై 30న విపత్తు ప్రభావానికి లోనైన ముండక్కై, చూరల్‌మల, అట్టామల పేర్లు డ్రాఫ్ట్‌లో లేవు. కాగా శనివారం ఉదయానికి వయనాడ్ మరణాల సంఖ్య 344 దాటేసింది. చాలామంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Similar News

News March 17, 2026

మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

image

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.

News March 17, 2026

24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్

image

వినియోగదారులకు వేగవంతమైన డెలివరీని అందించడమే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ‘24 స్పీడ్‌ పోస్ట్‌’, ‘48 స్పీడ్‌ పోస్ట్‌‌’ పేర్లతో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. తొలిదశలో హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సదుపాయం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. వస్తువులు పోస్టు చేసిన మరుసటి రోజే డెలివరీ అవ్వకపోతే పేమెంట్ తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. OTPతో డెలివరీ తీసుకోవచ్చు.

News March 17, 2026

మత మార్పిడులపై ఉక్కుపాదం.. కీలక బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం

image

బలవంతం, మోసం, ప్రలోభం, వివాహాల ద్వారా జరిగే మత మార్పిడులను నిషేధించే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్-2026కు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తారు. మైనర్, SC, ST, మహిళలు, రోగులతోపాటు సామూహిక మత మార్పిడులకు పాల్పడితే అదనంగా రూ.5 లక్షలు ఫైన్ ఉంటుంది. పదేపదే ఇవే నేరాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా విధిస్తారు.