News May 25, 2024

EVMలకు BJP ట్యాగ్స్ పెట్టారన్న TMC.. స్పందించిన WB CEO

image

EVMలను ట్యాంపర్ చేయాలని BJP యత్నిస్తోందని WB సీఎం మమత నేతృత్వంలోని TMC ఆరోపించింది. రఘునాథ్‌పూర్‌లో 5 EVMలపై BJP ట్యాగ్‌లున్నాయని ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. EC దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే పోలింగ్ ప్రారంభ సమయంలో ట్యాగ్స్‌పై అభ్యర్థులు, ఏజెంట్ల సంతకాలు తీసుకుంటామని, అప్పుడు BJP వాళ్లు మాత్రమే ఉండటంతో వారి సంతకాలు తీసుకున్నామని WB CEO బదులిచ్చింది.

Similar News

News December 1, 2025

13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్‌లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://www.ibps.in/

News December 1, 2025

మేడారం పనుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి: CM

image

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార‌ సంప్ర‌దాయాలు, నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. పొర‌పాట్లు దొర్లితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. రాతి ప‌నులు, ర‌హ‌దారులు, గ‌ద్దెల చుట్టూ రాక‌పోక‌ల‌కు మార్గాలు, భ‌క్తులు వేచి చూసే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి అంశంపై CM అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

News December 1, 2025

సజ్జ రైతులకు దక్కని మద్దతు ధర

image

AP: సజ్జలను పండించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట నాణ్యత, దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775గా ఉంటే.. నాణ్యత సరిగా లేదని రూ.1800 కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జలను సాగు చేశారు.