News August 13, 2025

రీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్

image

AP: 2 కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని YCP MP అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ‘కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్‌ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News August 13, 2025

లెఫ్ట్ హ్యాండర్స్ ప్రత్యేకతలు ఇవే..!

image

ఇవాళ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ప్రపంచ జనాభాలో 10-12 శాతం ఎడమ చేతి వాటం వారు ఉన్నారు. కుడి చేతివారితో పోలిస్తే లెఫ్ట్ హ్యాండర్స్‌కు స్వంతంత్ర భావాలు ఎక్కువ. వీరు ఒకేసారి ఎక్కువ పనులు చేస్తారు. షార్ప్, క్రియేటివిటీ, స్మార్ట్‌గా ఉంటారు. జబ్బు చేసినా, ప్రమాదాల్లో గాయపడినా త్వరగా కోలుకుంటారు. కొన్ని గేమ్స్ బాగా ఆడతారు. మెమొరీ పవర్ ఎక్కువ. వీరి ఆలోచనలు చాలా ఫాస్ట్. వీరిలో మేధావులు, రాజకీయవేత్తలు ఎక్కువ.

News August 13, 2025

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్

image

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ధరలు తగ్గాయి. దీంతో HYD బులియన్ మార్కెట్‌లోనూ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.50 తగ్గి రూ.1,01,350కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 13, 2025

SHAI HOPE: మోస్ట్ అండర్ రేటెడ్ వన్డే ప్లేయర్!

image

పాక్‌తో మూడో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ (120*) సెంచరీ బాదారు. దీంతో విండీస్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా హోప్(18) రికార్డులకెక్కారు. ప్రస్తుత వన్డే క్రికెట్‌లో హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్‌గా మిగిలిపోయారు. 137 ఇన్నింగ్సుల్లోనే 50.24 సగటుతో 18 సెంచరీలు, 29 ఫిఫ్టీలతో 5,879 రన్స్ బాదారు. ఆమ్లా, కోహ్లీ, బాబర్, డివిలియర్స్‌కు మాత్రమే అతడి కంటే మెరుగైన గణాంకాలు ఉన్నాయి.