News January 19, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్‌ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి.
Similar News
News February 19, 2025
2 రోజులు సెలవు

AP: పట్టభద్రుల, టీచర్స్ MLC స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో(ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్స్) 2 రోజులు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు FEB 26, పోలింగ్ రోజైన 27 తేదీల్లో సెలవు ఇవ్వాలని, అవసరమైతే కౌంటింగ్(MAR 3) రోజునా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 16 జిల్లాల్లో MLC ఎన్నికల పోలింగ్ జరగనుంది.
News February 19, 2025
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిర్చి యార్డ్‌కు చేరుకోనున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఫీజు పోరు నిరసనల్ని కోడ్ దృష్ట్యా వైసీపీ వాయిదా వేసుకుంది.
News February 19, 2025
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

AP: నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉ.9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ పడనుంది. వేడుకల్లో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.