News January 14, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ పబ్లిక్ టాక్

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని, వెంకీ నటన ఇరగదీశారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్టోరీ అంతగా లేదని, లాజిక్స్ వెతకకుండా చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.

Similar News

News February 11, 2025

MLC ఎలక్షన్స్: ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

image

TG: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 118 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్స్ స్థానానికి 15 మంది, WGL-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 13న మ.3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్ జరగనుంది.

News February 11, 2025

సల్మాన్-అట్లీ సినిమా రద్దు?

image

అట్లీ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్ నటించాల్సిన సినిమా ఆగిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కాల్సిన ఈ మూవీలో రజినీకాంత్ లేదా కమల్ హాసన్ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కాంబోలో మూవీ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌తో చేసే సినిమా కోసం అట్లీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News February 11, 2025

2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: దీదీ

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప.బెంగాల్ CM, TMC అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో AAPకు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్‌కు AAP మద్దతివ్వలేదు. అందుకే BJP గెలిచింది. కానీ ఇక్కడ మన పార్టీ ఒక్కటే చాలు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పార్టీ MLAల సమావేశంలో వ్యాఖ్యానించారు.

error: Content is protected !!