News October 21, 2024

మాకు రాష్ట్రాలతోకాదు దేశాలతోనే పోటీ: లోకేశ్

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ కేంద్ర మంత్రి జయంత్ చౌధురి, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించాలని, కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను APలో ఏర్పాటుచేయాలని కోరారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. అనంతరం ICEA ప్రతినిధులతోనూ చర్చించారు. పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. తమకు రాష్ట్రాలతోకాదు దేశాలతోనే పోటీ అని చెప్పారు.

Similar News

News October 16, 2025

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి: APSDMA

image

AP: దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని APSDMA తెలిపింది. దేశంలోకి మే 24న, రాష్ట్రంలోకి మే 26న ఈ రుతుపవనాలు ప్రవేశించినట్లు వివరించింది. అటు ఇవాళ దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ఇవాళ ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News October 16, 2025

డెక్కన్ సిమెంటు వివాదంతో నాకు సంబంధం లేదు: ఉత్తమ్

image

TG: డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ వివాదంపై తాను మాట్లాడేది లేదన్నారు. ‘నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా చెప్పారు కదా?’ అని ముక్తసరిగా స్పందించారు. కొన్నిరోజులుగా మంత్రి కొండా సురేఖకు ఇతర మంత్రులకు మధ్య వివాదం రేగడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా దృష్టి సారించింది. పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగారు.

News October 16, 2025

పాత రిజర్వేషన్లతో ‘స్థానిక’ ఎన్నికలు!

image

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ను అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్ల ఆధారంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.