News October 21, 2024

మాకు రాష్ట్రాలతోకాదు దేశాలతోనే పోటీ: లోకేశ్

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ కేంద్ర మంత్రి జయంత్ చౌధురి, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించాలని, కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను APలో ఏర్పాటుచేయాలని కోరారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. అనంతరం ICEA ప్రతినిధులతోనూ చర్చించారు. పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. తమకు రాష్ట్రాలతోకాదు దేశాలతోనే పోటీ అని చెప్పారు.

Similar News

News November 4, 2024

బెట్టింగ్ మార్కెట్‌లో ట్రంప్‌దే హవా

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు మ‌రికొన్ని గంటలే గ‌డువు ఉంది. ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ముంద‌స్తు పోల్ స‌ర్వేలు క‌మ‌ల‌, ట్రంప్ మ‌ధ్య హోరాహోరీ త‌ప్ప‌ద‌ని స్ప‌ష్ట‌ం చేస్తున్నాయి. అయితే బెట్టింగ్ మార్కెట్‌లో మాత్రం ట్రంప్ దూసుకుపోతున్నారు. ప్ర‌తి వేదిక ట్రంప్ అనూహ్య విజ‌యాన్ని అంచ‌నా వేస్తున్నాయి. BetOnline, Betfair, Bovada, PolyMarket వేదికలపై ట్రంప్ 50%పైగా విజయావకాశాలతో ముందున్నారు.

News November 4, 2024

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ

image

AP: అవసరమైతే తాను హోంమంత్రి పదవి చేపడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రి నారాయణ స్పందించారు. ఏ శాఖపైనైనా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించే అధికారం ఉంటుందని మంత్రి అన్నారు. పవన్ వ్యాఖ్యలను అలర్ట్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్నచిన్న సమస్యలుంటే సీఎం సమన్వయం చేస్తారని నారాయణ అన్నారు.

News November 4, 2024

సిరాజ్ మియా.. ఇలా అయితే కష్టమే!

image

టెస్టుల్లో టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది. 2023 నుంచి అతడు 16 టెస్టులు ఆడగా 34 వికెట్లు మాత్రమే తీశారు. విదేశాల్లో 5 టెస్టుల్లో 21 వికెట్లు తీయగా, సొంతగడ్డపై మాత్రం పూర్తిగా నిరాశ పరిచారు. 11 టెస్టుల్లో కేవలం 13 వికెట్లే పడగొట్టారు. ఆస్ట్రేలియాలో జరగనున్న BGT సిరీస్‌కూ సిరాజ్ ఎంపికయ్యారు. అందులో రాణించకపోతే ఈ హైదరాబాదీ పేసర్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.